SEBI: స్టాక్ మార్కెట్ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకున్న ‘సెబీ’
- ఫీజుల తగ్గింపునకు ఆమోదం
- అంకురాలు లిస్ట్ అయ్యేందుకు కొత్త నియమాలు
- నిధుల సమీకరణకు కూడా ఉపకరిస్తుంది
స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు వేచి చూస్తున్న కంపెనీల నుంచి బ్రోకర్లు, స్టాక్ ఎక్చేంజ్‌లు వసూలు చేస్తున్న ఫీజులను తగ్గించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. భారత స్టాక్ మార్కెట్ బలోపేతానికి నేడు సెబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టాక్ మార్కెట్‌లో అంకురాలు లిస్ట్ అయ్యేందుకు కొత్త నియమాలను తీసుకొచ్చింది.
వీటి వల్ల అంకురాల్లో పెట్టుబడి దారులు మదుపు చేసేందుకు దోహదపడటమే కాకుండా నిధుల సమీకరణకు కూడా ఉపకరిస్తుందని సెబీ భావించింది. అలాగే కార్పొరేట్లు ఎదుర్కొంటున్న రుణ పునరుద్ధరణ సమస్యలపై కూడా సెబీ నిర్ణయం తీసుకుంది. కమొడిటీ డెరివేటివ్స్‌లో ట్రేడ్ చేసేందుకుగాను మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లకు అనుమతినిచ్చింది. రుణ పునరుద్ధరణకు గాను ప్రత్యేక కేసులుగా భావిస్తున్న కొన్ని కంపెనీలకు మినహాయింపునిచ్చింది.