Venkat Reddy: వైసీపీకి రాజీనామా చేసిన గౌరు వెంకటరెడ్డి దంపతులు

  • పాణ్యం టికెట్ విషయంలో మనస్తాపం
  • వైఎస్ ఇచ్చే భరోసా.. జగన్‌లో కనిపించడం లేదు
  • నాకు ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎలా నమ్మాలి?

పాణ్యం టికెట్ విషయంలో వైసీపీ అధినేత జగన్ మొదట తమకు కేటాయిస్తానని చెప్పి.. అనంతరం వేరొకరికి కేటాయిస్తామనడం గౌరు వెంకటరెడ్డి దంపతుల్లో అసంతృప్తిని మిగిల్చింది. దీంతో వైసీపీకి గౌరు వెంకటరెడ్డి, చరిత రాజీనామా చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చే భరోసా.. జగన్‌లో కనిపించడం లేదని వెంకటరెడ్డి అన్నారు. గతంలో ముస్లింలకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని అడిగితే కేటాయించని జగన్.. ఇప్పుడు తనకు ఇస్తానంటే ఎలా నమ్మాలని చరిత ప్రశ్నించారు. ఈ నెల 9న తాము టీడీపీలో చేరబోతున్నామని గౌరు వెంకటరెడ్డి దంపతులు ప్రకటించారు.

Venkat Reddy
Charitha
Jagan
Chandrababu
Panyam
YSRCP
  • Loading...

More Telugu News