India: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కవిత అభినందన్ సోదరి రాసింది కాదు!
- ఫేస్ బుక్, వాట్సాప్ లో వైరల్
- అభినందన్ సోదరి రాసిందంటూ ప్రచారం
- ఆ కవిత రాసింది ఓ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ నుంచి స్వదేశానికి వస్తుండడంతో దేశంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా అభినందన్ రాక గురించే చర్చించుకుంటున్నారు. అయితే, ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అభినందన్ గురించి ఓ కవిత వైరల్ అవుతోంది. మై బ్రదర్ విత్ బ్లడీడ్ నోస్ అనే పేరుతో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఆ కవితకు విపరీతమైన లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. ఆ కవితను రాసింది అభినందన్ సోదరి అదితి అని ప్రచారం కావడంతో దాన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఆమె పేరుతోనే క్రెడిట్ ఇస్తూ ఆ కవితను సోషల్ మీడియాలో ఆ చివర నుంచి ఈ చివరకు పాకిస్తున్నారు.
అయితే అసలు విషయం ఏంటంటే... వాస్తవానికి ఆ కవితను రాసింది అభినందన్ సోదరి కాదు. వరుణ్ రామచంద్రన్ అయ్యర్ అనే మేనేజ్ మెంట్ కన్సల్టెంట్. ఈ విషయాన్ని ఓ నేషనల్ మీడియా సంస్థ గుర్తించింది. ఆ కవిత శీర్షికలో బ్రదర్ అన్న పదం ఉండడంతో అది అభినందన్ తోబుట్టువులు ఎవరైనా రాసి ఉంటారని నెటిజన్లు అత్యుత్సాహం చూపించి ఉంటారని, అందుకే అభినందన్ సోదరి అదితికే ఆ క్రెడిట్ ఇచ్చేశారని సదరు మీడియా సంస్థ అభిప్రాయపడింది.