paruchuri: 'ఖలేజా'కథ అక్కడి నుంచి మొదలుపెట్టకుండా ఉండవలసింది: పరుచూరి గోపాలకృష్ణ
- 'ఖలేజా' సినిమాను ఎక్కువసార్లు చూశాను
- హీరో వైపు నుంచి కథ కామెడీగా నడిచింది
- హీరోయిన్ పాత్రకి కనెక్ట్ కాలేకపోయారు
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'ఖలేజా' సినిమాను గురించి ప్రస్తావించారు. టీవీలో వచ్చే సినిమాల్లో 'అతడు' తరువాత నేను ఎక్కువగా చూసిన సినిమా 'ఖలేజా'. ఇందులో మనకి మూడు కథలు కనిపిస్తాయి. ఒకటి హీరో అప్పు కథ .. రెండవది హీరోయిన్ ఇంట్లో నుంచి పారిపోయి రాజస్థాన్ చేరుకునే కథ .. మూడవది ఓ దేవుడులాంటి మనిషి కోసం రాజస్థాన్ లోని ఓ గ్రామస్తులు వెయిట్ చేసే కథ.
ఈ కథను ముందుగా నేను విని వుంటే, 'సార్ .. గ్రామంలో కథను ముందుగా మొదలుపెట్టొద్దు' అని చెప్పేవాడిని. ఎందుకంటే గ్రామస్తులలో ఒకరు తమకి అండగా నిలిచే దేవుడిని తీసుకురావడానికి వెళతాడు. దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి .. అతణ్ణి ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పి పంపించిన తరువాత, దాదాపు గంటసేపు వేరే కథ నడుస్తుంది. ఈ గంటసేపు కూడా హీరో వైపు నుంచి కథ చాలా కామెడీగా వెళ్లిపోతూ ఉంటుంది. హీరోయిన్ ను ఐరన్ లెగ్ గా పరిచయం చేయడం వలన, ఆడిటోరియంలోని అమ్మాయిలెవరూ ఆ పాత్రకు కనెక్ట్ కాలేకపోయారు" అని చెప్పుకొచ్చారు.