venkatesh: 'వెంకీమామ'లో వెంకటేశ్ .. చైతూ పాత్రలు ఇవే
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0d5a8ce45ac3ff9ace8ac578b671af8bc15e7025.jpg)
- బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ'
- రాజమండ్రిలో షూటింగ్
- దసరాకి విడుదల చేసే ఆలోచన
బాబీ దర్శకత్వంలో వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీమామ' సినిమా రూపొందుతోంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రిలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-c09936dbd81d25fc991875a4c6eac63d196c414f.jpg)