Andhra Pradesh: మోదీజీ.. ఏపీ రూ.6,500 కోట్ల ఆదాయం కోల్పోవడానికి మీరే కారణమని తెలుగు ప్రజలందరికీ తెలుసు!: నారా లోకేశ్

  • విశాఖపట్నంకు రైల్వే జోన్ కేవలం కంటితుడుపు చర్యే
  • ఇప్పుడు పుండు మీద కారం చల్లేందుకు వైజాగ్ కు వచ్చారు
  • ట్విట్టర్ లో మండిపడ్డ ఏపీ ఐటీ మంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైజాగ్ కు మోదీ రైల్వే జోన్ ప్రకటించడం కేవలం కంటితుడుపు చర్యేనని విమర్శించారు. మోదీ కారణంగానే ఏపీకి రూ.6,500 కోట్ల ఆదాయం రాకుండా పోయిందని మండిపడ్డారు.

ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘నరేంద్ర మోదీ జీ.. విశాఖపట్నంకు రైల్వేజోన్ విషయంలో మీ ప్రకటన కేవలం కంటితుడుపు చర్యే. ఏపీ రూ.6,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోయేందుకు మీరే కారణమని ప్రతీ తెలుగువాడికి తెలుసు. ఇప్పుడు మాటలగారడితో పుండు మీద కారం చల్లేందుకు మీరు వైజాగ్ కు వచ్చారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  #WeDemand  #GoBackModi  #ModiCheatedUsAgain వంటి హ్యాష్ ట్యాగ్ లను తన ట్వీట్ కు లోకేశ్ జతచేశారు.

Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
BJP
Narendra Modi
Visakhapatnam District
railway zone
  • Loading...

More Telugu News