Andhra Pradesh: వైసీపీలో చేరిన చిత్తూరు టీడీపీ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన జగన్!

  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోహన్, శ్రీను
  • సాదరంగా ఆహ్వానించిన వైసీపీ అధినేత
  • వైసీపీ విజయం కోసం కృషి చేస్తామన్న నేతలు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరందుకుంటున్నాయి. తాజాగా ఈరోజు చిత్తూరు జిల్లా టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. చిత్తూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు మాపక్షి మోహన్, 8 మంది కార్పొరేటర్లు, మంగళగిరికి చెందిన ఉడత శ్రీను, తదితరులు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా వీరిందరికి పార్టీ కండువాలు కప్పిన జగన్.. వైసీపీలోకి ఆహ్వానించారు. కాగా, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కృషి చేస్తామని నేతలు తెలిపారు. ఈసారి వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందనీ, జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Chittoor District
Telugudesam
YSRCP
Jagan
joining
  • Loading...

More Telugu News