India: భారత పైలట్ అభినందన్ ను విడుదల చేయొద్దు.. కోర్టుల్లో పాకిస్థానీల పిటిషన్లు!
- దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో దాఖలు
- ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత భారత్ కు అప్పగింత
- సరిహద్దుకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను ఈరోజు విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయుసేన అధికారులతో పాటు వర్ధమాన్ కుటుంబ సభ్యులు, పలువురు సాధారణ పౌరులు పంజాబ్ లోని అట్టారి బోర్డర్ వద్దకు చేరుకున్నారు.
అయితే వర్ధమాన్ ను భారత్ కు అప్పగించడంపై పాకిస్థాన్ లో కొందరు పెదవి విరుస్తున్నారు. ఆయన్ను భారత్ కు అప్పగించకుండా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ కొందరు పాకిస్థాన్ లోని పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. మరోపక్క, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అభినందన్ ను పాకిస్థాన్ భారత్ కు అప్పగించే అవకాశముందని వాయుసేన అధికారులు భావిస్తున్నారు.