Abhinandan: ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు విమానంలో అభినందన్ తరలింపు!

  • ప్రమాదవశాత్తూ పాక్ భూభాగంలో దిగిన అభినందన్
  • మధ్యాహ్నం 2 గంటల తరువాత అప్పగింత
  • వాఘా సరిహద్దుల వద్ద సందడి

మిగ్ యుద్ధ విమానాన్ని నడుపుతూ, ప్రమాదవశాత్తూ పాకిస్థాన్ భూభాగంలో పడిపోయిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, ఈ మధ్యాహ్నం రెండు గంటల తరువాత వాఘా సరిహద్దుల వద్ద మాతృభూమిని ముద్దాడనున్నాడు. ప్రస్తుతం ఇస్లామాబాద్ లో ఉన్న ఆయన్ను, విమానంలో లాహోర్ కు తరలించేందుకు పాక్ సర్కారు ఏర్పాటు చేసింది.

అక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాఘా బార్డర్ కు ఆయన్ను రోడ్డు మార్గంలో తీసుకువచ్చి భారత వాయుసేనకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వాఘా బార్డర్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అధికారులు చేరిపోగా, అభినందన్ ను కవర్ చేసేందుకు మీడియా సంస్థలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశాయి.

Abhinandan
Islamabad
Lahore
Pakistan
Wagha
  • Loading...

More Telugu News