Andhra Pradese: కచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను: మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ

  • ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం
  • ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తెలియజేస్తా
  • ఏపీకి ప్రత్యేక హోదాను కచ్చితంగా అమలు చేయాలి

కచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ని పలకరించిన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ  చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తెలియజేస్తానని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే, ఆ హోదా కావాలని యువత కోరుకుంటోందని చెప్పారు. ఏపీకి రైల్వేజోన్ ప్రకటించినట్టుగానే, ప్రత్యేక హోదా పైనా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని అన్నారు.  

Andhra Pradese
ex ips
lakshmi narayana
  • Loading...

More Telugu News