Surya: తెలంగాణ పోలీసులకు పట్టుబడిన మావో నేత సూర్యం... ఆందోళనలో సానుభూతిపరులు!

  • మురళీనగర్ లో ఆశ్రయం పొందిన సూర్యం
  • విషయం తెలుసుకుని నిర్బంధ తనిఖీలు
  • తన భర్తకు హాని తలపెట్టవద్దన్న సూర్యం భార్య స్వరూప

వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి అడవుల్లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అగ్రనేత సూర్యం అలియాస్ సోమ భాస్కర్ కూంబింగ్ దళాలకు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని మురళీనగర్ లో దళ సభ్యులు ఆశ్రయం పొందుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు గ్రామాన్ని దిగ్భంధించి నిర్బంధ తనిఖీలు చేయగా, సూర్యం పట్టుబడినట్టు సమాచారం.

ఆపై గ్రామస్తులకు తెలియకుండా, కొత్తగూడకు ఆయన్ను తరలించారని తెలుస్తుండగా, సూర్యం క్షేమంపై మావోయిస్టు సానుభూతిపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాన్ని వెంటనే కోర్టులో హజరు పరచాలని జిల్లా మానవ హక్కుల సంఘం నేతలు లావుడ్య రాజు, సూర్యం భార్య స్వరూప డిమాండ్‌ చేశారు. ఆయన్ను తక్షణం మీడియా ముందుకు తీసుకురావాలని కోరారు. తన భర్తకు ఎటువంటి హామీ తలపెట్టవద్దని స్వరూప కోరింది.

Surya
Telangana
Mao
CPI ML New DEmocrasy
Police
Arrest
  • Loading...

More Telugu News