abhinandan: అభినందన్ కోసం వాఘా సరిహద్దుల్లో వేచి చూస్తున్న వాయుసేన అధికారులు

  • మధ్యాహ్నం భారత్ లో అడుగుపెట్టనున్న అభినందన్
  • స్వాగతం పలికేందుకు సరిహద్దు వద్దకు వెళ్లనున్న అమరీందర్ సింగ్
  • భారీ ఎత్తున సరిహద్దు వద్దకు చేరుకున్న ప్రజలు

పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ఈ రోజు మన దేశంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయనను ఈరోజు విడుదల చేస్తున్నట్టు నిన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం ఒంటి గంట, రెండు గంటల మధ్య అభినందన్ ను పాక్ దళాలు భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వాయుసేన అధికారులు ఇప్పటికే వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా అభినందన్ కు స్వాగతం పలికేందుకు సరిహద్దు వద్దకు వెళ్లనున్నారు. అంతేకాదు, అభినందన్ కోసం భారీ ఎత్తున భారత ప్రజలు అక్కడకు చేరుకున్నారు. 

abhinandan
airforce
pilot
wagha boarder
pakistan
india
amarinder singh
  • Loading...

More Telugu News