Murali Mohan: ఇక ఎన్నికలు వద్దు... సంచలన నిర్ణయం తీసుకున్న నటుడు మురళీమోహన్!

  • ట్రస్ట్ కార్యకలాపాలపై మరింత దృష్టి
  • నేడు రాజమహేంద్రవరంపై సీఎం సమీక్ష
  • అధినేతకు చెప్పనున్న మురళీమోహన్!

ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యుడు మురళీమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయరాదని ఆయన నిర్ణయించుకున్నారని, ఇదే విషయాన్ని నేడు సీఎం చంద్రబాబును కలిసి ఆయన వివరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదే సమయంలో మురళీమోహన్ కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ కార్యకలాపాలపై మరింత దృష్టిని సారించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. నేడు రాజమహేంద్రవరం ఎంపీ స్థానం, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో నిలపాల్సిన అభ్యర్థులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనుండగా, దానికి హాజరై, తన మనసులోని అభిప్రాయాన్ని మురళీమోహన్ వెల్లడిస్తారని టీడీపీ వర్గాల సమాచారం.

Murali Mohan
Rajamahendravaram
Loksabha
Roopa
Chandrababu
  • Loading...

More Telugu News