Andhra Pradesh: పూర్తి స్థాయి రైల్వేజోన్ ఇవ్వనందుకు నిరసన.. 48 గంటల దీక్షకు దిగిన చలసాని!

  • విశాఖపట్టణంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన
  • కేకే లైనుతో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలి
  • రేపు విశాఖకు మోదీ రాకపైనా నిరసన

ఏపీలోని విశాఖపట్టణం కేంద్రంగా రైల్వేజోన్ ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎంతో చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ లో కొంత భాగం మాత్రమే ఉండేట్టుగా ఈ రైల్వేజోన్ ఏర్పాటు కానుండటంపై టీడీపీ నేతలు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సమితి నేత చలసాని శ్రీనివాస్ దీక్షకు దిగారు. విశాఖపట్టణంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 48 గంటల దీక్షను చేపట్టారు. విశాఖకు మోదీ రానుండటాన్ని, పూర్తి స్థాయి రైల్వేజోన్ రాకపోవడాన్ని నిరసిస్తూ ఈ దీక్షకు దిగారు. కేకే లైనుతో కూడిన విశాఖ రైల్వేజోన్ ప్రకటించాలని చలసాని డిమాండ్ చేస్తున్నారు.

Andhra Pradesh
Vizag
pm
modi
chalasani
  • Loading...

More Telugu News