Mamatha Benerji: అభినందన్ విడుదలపై స్పందించిన మమత
- అభినందన్‌ను రేపు విడుదల చేస్తామన్న ఇమ్రాన్
- దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడంతో దిగి వచ్చిన పాక్
- అభినందన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామన్న దీదీ
పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను తాము శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఐక్య రాజ్య సమితి వేదికగా భారత్.. దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడంతో పాకిస్థాన్ దిగివచ్చింది. అభినందన్‌ను రేపు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పైలెట్ అభినందన్ కుటుంబ సభ్యులతో పాటు దేశ ప్రజలందరం, ఆయన క్షేమంగా తిరిగి రావాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’ అంటూ దీదీ ట్వీట్ చేశారు.