abhinandan: బ్రేకింగ్... అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటన

  • పాక్ ఆర్మీ అదుపులో ఉన్న అభినందన్
  • విడుదల చేయాలంటూ భారత్ విన్నపం
  • రేపు విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్

పాక్ సైన్యం అధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడుదల చేయబోతున్నట్టు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పాక్ పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ ఈమేరకు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకునే క్రమంలో భారత్ ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నిన్న తాను యత్నించానని, కానీ కుదరలేదని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను... తాము భయపడుతున్నట్టుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. మరోవైపు ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయం పట్ల భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

abhinandan
imran khan
Pakistan
army
release
  • Loading...

More Telugu News