Andhra Pradesh: రేషన్ డీలర్లకు ప్రభుత్వ పథకాలు, ‘చంద్రన్న బీమా’ వర్తింపజేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

  • దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ఆహారభద్రత ఉంది
  • మంచి పథకాలను ప్రజలకు తెలియజెప్పాలి 
  • రాబోయే రోజుల్లో విలేజ్ మాల్స్ గా డీలర్ల షాపులు మారాలి

ఏపీలో రేషన్ డీలర్లందరికీ ప్రభుత్వ పథకాలు, ‘చంద్రన్న బీమా’ పథకం వర్తింపజేస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ రాష్ట్ర డీలర్ల ఆత్మీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఆహారభద్రత ఉందని, ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాలను డీలర్లు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో విలేజ్ మాల్స్ గా డీలర్ల షాపులు మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన హామీలు అమలను చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్రం నమ్మించి రాష్ట్రాన్ని మోసం చేసిందని, 18 హామీలను ప్రధాని మోదీ తుంగలో తొక్కారని, జరిగిన అన్యాయాన్ని డీలర్లు ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు.

Andhra Pradesh
cm
Chandrababu
ration dealers
  • Loading...

More Telugu News