kalyan ram: టీచర్ చెప్పిన ఆ మాట నన్ను మార్చేసింది: హీరో కల్యాణ్ రామ్
- ఇంట్లో బాగా అల్లరి చేసేవాడిని
- స్కూల్లో కోతి వేషాలు వేసేవాడిని
- ఆ రోజు నుంచి నన్ను నేను మార్చుకున్నాను
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో '118' నిర్మితమైంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు.
"నేను స్కూలుకి వెళ్లే రోజుల్లో చాలా కోతి వేషాలు వేసేవాడిని .. ఇంట్లో బాగా అల్లరి చేసేవాడిని. అమ్మానాన్నలకు చెప్పకుండా సైకిల్ వేసుకుని వెళ్లిపోయేవాడిని. క్లాస్ రూమ్ లో పిల్లలను మానిటర్ చేయమని చెప్పి టీచర్ వెళితే, నా మాట వినని పిల్లల జుట్టు కత్తిరించేవాడిని.
అలాంటప్పుడు ఒక రోజున టీచర్ నన్ను పిలిచి .. "రామారావుగారి మనవడివి కదా .. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. జీవితంలో నువ్వు ఏ పని చేసినా దాని ప్రభావం కేవలం నీ క్యారెక్టర్ పైనే కాదు, మీ నాన్న .. మీ తాతయ్యలపై కూడా పడుతుంది. నువ్వు చేసే పనులు వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు అని చెప్పారు. అంతే .. ఆ రోజు నుంచి నేను నా ప్రవర్తన మార్చుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.