Andhra Pradesh: వైసీపీలో చేరిన జూ.ఎన్టీఆర్ మామ నార్నె, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి!

  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • కండువా కప్పి ఆహ్వానించిన వైసీపీ అధినేత
  • గతంలోనే జగన్ ను కలుసుకున్న నార్నె, కిల్లి

ఆంధ్రప్రదేశ్ లో విపక్ష వైసీపీలోకి రాజకీయ వలసలు జోరందుకున్నాయి. తాజాగా ఈరోజు సినీనటుడు జూ.ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్న వీరిద్దరిని జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నార్నె శ్రీనివాసరావుతో పాటు కృపారాణి గతంలోనే జగన్ తో భేటీ అయ్యారు. అయితే మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరాలని సూచించడంతో వీరిద్దరూ ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Andhra Pradesh
Telugudesam
Congress
YSRCP
killi kruparani
jr ntr
  • Loading...

More Telugu News