kaushal: ఛానల్ రేటింగ్స్ పెంచుకోవడానికి నా జీవితాన్ని నాశనం చేస్తారా: 'బిగ్ బాస్' కౌశల్
- అభిమానులకే సమయం కేటాయించాను
- ఎవరు ఆహ్వానించినా వెళ్లి కలిశాను
- నాకు డబ్బుకన్నా అభిమానమే ముఖ్యం
'బిగ్ బాస్ 2' లో కౌశల్ విజేతగా నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి కౌశల్ ఆర్మీలోని కొంతమంది సభ్యులు, రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిస్పందిస్తూ కౌశల్ కూడా మీడియా ముందుకు వచ్చాడు.
'బిగ్ బాస్ 2' నుంచి బయటికి వచ్చాక నేను నా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి కూడా వెళ్లలేదు. సినిమాలను కూడా పక్కన పెట్టేసి .. నా గెలుపుకి కారణమైన నా అభిమానులతోనే గడుపుతూ వచ్చాను. నాపై అభిమానంతో ఎవరు వచ్చి ఆహ్వానించినా వెళ్లి కలిశాను. నాకు కావలసింది అభిమానమే గానీ .. డబ్బుకాదు.
నాపై ఆరోపణలు చేస్తున్నవారి మాటల్లో నిజానిజాలను గురించి తెలుసుకోకుండా, కొన్ని టీవీ చానల్స్ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఒక వైపున సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంటే యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను ప్రసారం చేయాలిగానీ, టీఆర్పీల కోసం నా పేరును వాడుకుని నా జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు" అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు.