Andhra Pradesh: పశ్చిమగోదావరిలో యువతిపై అత్యాచారం, హత్య.. 4 రోజుల్లోనే నిందితుడి అరెస్ట్!

  • ఈ నెల 24న జీలకర్రగూడెంలో ఘటన
  • అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన రాజు
  • అడ్డుకునేందుకు యత్నించిన యువతి స్నేహితుడిపై దాడి

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెంలో ఈనెల 24న గుర్తుతెలియని దుండగుడు ఓ యువతిపై అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి యత్నించిన యువతి స్నేహితుడు నవీన్ పై తీవ్రంగా దాడి జరిగింది.

దీంతో ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాలుగు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. రాజు అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే ఓ తోటలో పనిచేస్తున్న రాజు గతంలో చాలామంది మహిళలపై లైంగికదాడి చేశాడన్నారు.

నిందితుడిని ప్రస్తుతం అరెస్ట్ చేశామని పోలీసులు అన్నారు. యువతిపై రాజు అత్యాచారం చేయబోగా ఆమె స్నేహితుడు నవీన్ అడ్డుకున్నాడనీ, దీంతో నవీన్ పై రాజు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడని పేర్కొన్నారు. అనంతరం యువతిపై లైంగికదాడి చేసి కిరాతకంగా హత్య చేశాడన్నారు.

ఈ నెల 24న ఆదివారం కావడంతో యువతీయువకులు జీలకర్రగూడెంలోని బౌద్ధారామాల సందర్శనకు వచ్చారని తెలిపారు. మరికాసేపట్లో నిందితుడు రాజును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Andhra Pradesh
West Godavari District
rape and murder
Police
  • Loading...

More Telugu News