surya: 'కాప్పాన్' యూనిట్ సభ్యులకు బిర్యాని వడ్డించిన సూర్య
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d6f0cd11ed3cb571b1fb5715377f079b4aa286eb.jpg)
- సూర్య హీరోగా రూపొందుతోన్న 'కాప్పాన్'
- నాయికగా సాయేషా సైగల్
- కీలకమైన పాత్రలో మెహన్ లాల్
తమిళనాట సూర్యకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. జయాపజయాల సంగతి అటుంచితే, అభిమానులతో ఎంతమాత్రం గ్యాప్ రాకుండా ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'కాప్పాన్' రూపొందుతోంది. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ లాల్ .. ఆర్య .. పూర్ణ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-417bdf323e1e1142ce34bb5a04cbcb589e2131f7.jpg)