సాక్షి టీవీ ఛానల్ కు నేను రిపోర్టర్ గా వ్యవహరించడానికి కారణం అదే: రేణు దేశాయ్
- రైతుల కోసం నేను ఒక టీవీ షో చేస్తున్నాను
- ఇప్పటి వరకు 200 మంది రైతులను కలిశాను
- నేను చేస్తున్న పనిని రాజకీయాలతో ముడిపెట్టవద్దు
రైతుల జీవితాలను, వారి కష్టాలను వెలుగులోకి తెచ్చేందుకే తాను సాక్షి తరపున రిపోర్టర్ గా వ్యవహరించానని రేణు తెలిపారు. రైతులకు సంబంధించిన ఒక టీవీ కార్యక్రమాన్ని తాను చేస్తున్నానని చెప్పారు. రైతుల కోసం తాను చేస్తున్న పనిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని విన్నవించారు. ఇప్పటి వరకు తాను 200 మంది రైతులను కలిశానని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన వల్ల ఒక్క రైతు జీవితం బాగుపడినా తాను చాలా సంతోషిస్తానని అన్నారు.