Wing Commander Abhinandan: వింగ్ కమాండర్ అభినందన్ విడిపించేందుకు భారత్ చర్యలు ముమ్మరం!
- అభినందన్‌ను విడిచిపెట్టాలని కోరిన భారత్
- పాక్ విదేశీ మంత్రిత్వ శాఖకు పాక్‌లోని భారత హైకమిషన్ డీమార్చ్
- అభినందన్ కోసం ప్రార్థిస్తున్న భారతావని
పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారత వాయసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను క్షేమంగా విడిపించేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అభినందన్‌కు ఎటువంటి హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలని కోరుతూ పాకిస్థాన్‌లోని భారత్ హైకమిషన్.. పాక్ విదేశీ వ్యవహారాల శాఖను కోరింది. న్యూఢిల్లీలోని పాక్ తాత్కాలిక హై కమిషనర్‌కు నిన్ననే ఈ విషయాన్నిస్పష్టం చేసిన భారత్ తాజాగా, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది.
పాక్ చెరలో బందీగా ఉన్న అభినందన్ ఏమాత్రం గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. పాక్ చిత్రహింసలు పెట్టి రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా తన పేరు, హోదాకు మించిన వివరాలు వెల్లడించడం లేదు.
అభినందన్ తిరిగి క్షేమంగా భారత్ చేరుకోవాలని దేశం మొత్తం ఆకాంక్షిస్తోంది. అతడి విడుదల కోసం యావత్ దేశం ప్రార్థనలు చేస్తోంది. జెనీవా ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉండాలని, వింగ్ కమాండర్ అభినందన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని, యుద్ధ నీతిని ఉల్లంఘించి అతడికి హాని తలపెట్టవద్దని భారత్ ఇప్పటికే పాక్‌కు విజ్ఞప్తి చేసింది.