SriDharani: 'దండుపాళ్యం' సినిమా చూసి... 14 రేప్ లు, 4 హత్యలు... పశ్చిమ గోదావరి జిల్లాలో కామ పిశాచి!

  • శ్రీధరణి హత్య కేసును విచారించిన పోలీసులు
  • నమ్మలేని నిజాల వెలికితీత
  • కన్ను పడితే అత్యాచారం చేసే రాజు
  • కఠిన శిక్ష పడేలా చూస్తామన్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట సమీపంలోని బౌద్ధారామాల వద్ద జరిగిన శ్రీధరణి (18) హత్య కేసులో నిందితుడైన పొట్లూరు రాజును విచారించిన పోలీసులు నమ్మలేని నిజాలను వెలికితీశారు. 'దండుపాళ్యం' సినిమాను చూసి కామ పిశాచిగా మారిన రాజు, తనకు కనిపించిన ప్రేమ జంటలపై దాడులు చేశాడని, సైకోగా మారిపోయి ఇప్పటివరకూ 14 మందిపై అత్యాచారం చేయడంతో పాటు వారిలో నలుగురిని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. అతని కంటికి కనిపించిన అమ్మాయి అత్యాచారానికి గురి కావాల్సిందేనని, లేకుంటే కాటికి పోవాల్సిందేనని అధికారులు చెప్పారు. రాజును విచారించిన తరువాత, అతని దాష్టీకాలు తమకు గగుర్పాటు కలిగించాయని ఈ సందర్భంగా పోలీసు అధికారులు వెల్లడించడం గమనార్హం.

కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకుని, జీ కొత్తపల్లికి మకాం మార్చాడని తెలిపిన పోలీసులు, జీడితోటలకు కాపలాకాస్తూ, పక్షులు, జంతువులను వెంటాడుతూ తిరుగుతుంటాడని, తనకు తారసపడ్డ ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు గుంజుతాడని, తనకు నచ్చితే, యువకుడిని చావగొట్టి, ఆమెపై అత్యాచారం చేస్తాడని, ఆ సమయంలో ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోబోడని తెలిపారు. చంపుతానని బెదిరించి అత్యాచారం చేస్తాడని, ఎవరైనా ఎదురు తిరిగి సహకరించకుంటే దారుణంగా హతమారుస్తాడని చెప్పారు. రాజుకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు.

SriDharani
West Godavari District
Krishna District
Raju
Police
Rape
  • Loading...

More Telugu News