India: పుల్వామా దాడిపై పాక్ కు ఆధారాలు సమర్పించిన భారత్

  • దాడికి పాల్పడింది జైషే మహ్మద్
  • దాని స్థావరాలు ఉన్నది పాకిస్థాన్ లో
  • పాక్ హైకమిషనర్ కు సాక్ష్యాధారాలు అప్పగింత

పుల్వామా దాడి ఘటనను ఖండిస్తూ ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడా చేయని పాకిస్థాన్ కు తిరుగులేని సాక్ష్యాధారాలు చూపించింది భారత్. పుల్వామా ఘటనకు కారణం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అని తెలిసినా పాక్ ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించడానికి ససేమిరా అంటోంది.

ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడింది జైషే మహ్మద్ ఉగ్రవాది అని, అతడికి సాయం అందింది పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాల నుంచే అని స్పష్టంగా ఆధారాలతో సహా పాక్ కు వివరించింది భారత్. ఈ మేరకు భారత్ లో పాక్ తాత్కాలిక హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు ఆధారాలు అందించింది. పాక్ హైకమిషనర్ కు బుధవారం మధ్యాహ్నం భారత విదేశాంగ శాఖ సమన్లు పంపింది. భారత్ గగనతలంలోకి పాక్ యుద్ధవిమానాలు ప్రవేశించాయని, భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయంటూ విదేశాంగ శాఖ తన నిరసన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News