Delhi court: అప్రూవర్‌గా మారేందుకు అవకాశమివ్వండి.. ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజీవ్ సక్సేనా!

  • సక్సేనాకు బెయిల్ మంజూరు
  • పిటిషన్‌పై స్పందించాలన్న అరవింద్ కుమార్
  • విచారణ గురువారానికి వాయిదా

అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కార్పొరేట్ లాబీయిస్టు రాజీవ్ సక్సేనాకు ఢిల్లీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీపై ఆయనకు ఆంక్షలతో కూడిన బెయిల్ లభించింది. అయితే ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సక్సేనా వేసిన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను ఆదేశిస్తూ, విచారణను గురువారానికి వాయిదా వేశారు.

Delhi court
Aravind Kumar
Enforcement Directorate
Agusta Westland
Rajiv Saxena
  • Loading...

More Telugu News