iaf: మిస్సయింది ఒకరా లేక ఇద్దరు పైలట్లా?

  • ఒక పైలట్ మిస్సింగ్ అని చెప్పిన భారత విదేశాంగ శాఖ
  • ఇద్దరు పైలట్లు తమ అదుపులో ఉన్నారన్న పాక్
  • ఒక పైలట్ ను ఆసుపత్రికి తరలించామన్న పాక్ సైన్యం

భారత వాయుసేనకు చెందిన పైలట్ మిస్సింగ్ పై గందరగోళం నెలకొంది. ఒక పైలట్ కనిపించడం లేదని భారత విదేశాంగ కార్యదర్శి రవీష్ కుమార్ తెలిపారు. మరోవైపు తాము ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నామని పాక్ సైన్యం ప్రకటించింది. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్న వీడియోను విడుదల చేసింది. మరో పైలట్ ను ఆసుపత్రికి తరలించామని తెలిపింది. దీంతో, పాక్ అధీనంలో ఒక పైలట్ ఉన్నాడా? లేక ఇద్దరు ఉన్నారా? అనే విషయంలో గందరగోళం నెలకొంది.

iaf
pilot
missing
Pakistan
  • Loading...

More Telugu News