nepal: నేపాల్ లో కూలిన హెలికాఫ్టర్.. మృతుల్లో పర్యాటక శాఖ మంత్రి!

  • నేపాల్ లోని తెహ్రాతూమ్ జిల్లాలో ఘటన
  • ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి
  • ధ్రువీకరించిన నేపాల్ విమానయాన సంస్థ  

నేపాల్ లో హెలికాఫ్టర్ కూలిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నేపాల్ పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర అధికారి కూడా ఉన్నారు. నేపాల్ లోని తెహ్రాతూమ్ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం, చుహన్ దండలో విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీలించడానికి హెలికాఫ్టర్ లో ఆయన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనను నేపాల్ పౌర విమానయాన సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్ లో మంత్రి రవీంద్రతో పాటు ఆయన భద్రతా సిబ్బంది, పైలట్, యతి ఎయిర్ లైన్స్ డైరెక్టర్ ఆంగ్ చింగ్ షెర్పా, నేపాల్ ప్రధాని దగ్గర బంధువు యబ్బరాజ్ దహల్ ఉన్నట్టు సమాచారం.    

nepal
helicopter
tourism
minister
ravindra
  • Loading...

More Telugu News