Andhra Pradesh: ఏపీలో రెచ్చిపోయిన దుండగులు.. తల్లీకుమార్తెలను నగ్నంగా చేసి దాడి!

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • పొలం విషయంలో వాగ్వాదం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

పొలానికి సంబంధించిన విషయంలో వాగ్వాదం చెలరేగడంతో కొందరు దుండగులు రెచ్చిపోయారు. తమకు అడ్డు వస్తున్నందుకు తల్లీకుమార్తెలను వివస్త్రలను చేసి చెట్టుకు కట్టేసి కొట్టారు. అనంతరం వీధుల్లో ఈడ్చుకెళ్లారు. ఈ సందర్భంగా తమను కాపాడాలని తల్లీకుమార్తెలు ఆర్తనాదాలు చేయగా, సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ బాలిక(11)తన తల్లితో కలిసి ఉంటోంది. అయితే వీరి కుటుంబానికి భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుకుటుంబాల మధ్య నిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సదరు వ్యక్తులు రెచ్చిపోయారు. తల్లీకుమార్తెలను వివస్త్రలుగా చేసి ఓ చెట్టుకు కట్టేశారు. అనంతరం విచక్షణారహితంగా చావబాదారు. ఆ తర్వాత వీధుల వెంట నగ్నంగా ఈడ్చుకెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు బాధిత కుటుంబం ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Andhra Pradesh
East Godavari District
attack
Police
mother and daughter
  • Loading...

More Telugu News