Pakistan: భారత్ దాడుల ఎఫెక్ట్.. కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్
- ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం
- 1290 పాయింట్లు కోల్పోయిన కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్
- మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశం
పాకిస్థాన్ లోని టెర్రర్ క్యాంపులపై భారత వాయుసేన దాడులు, ఈరోజు పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేయడంలాంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీని ప్రభావం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 100 ఇండెక్స్ ఏకంగా 1290 పాయింట్లు కోల్పోయింది. గత 55 రోజుల్లో ఈ స్థాయిలో మార్కెట్ కుప్పకూలడం ఇదే ప్రథమం. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ స్టాక్ మార్కెట్లు మరింత కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి.