WAR: యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్.. రహస్యంగా సరిహద్దుకు యుద్ధ ట్యాంకుల తరలింపు!

  • పంజాబ్ ప్రావిన్సులోని సియాల్ కోట్ లో మోహరింపు
  • అధికారికంగా ఇంకా స్పందించని పాకిస్థాన్
  • ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న నెటిజన్లు

పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ ఈరోజు కూల్చివేసిన సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి రావడంతో కాల్పులు జరపగా, దెబ్బతిన్న పాక్ విమానం నియంత్రణ రేఖ(ఎల్వోసీ)కి 3 కిలోమీటర్ల దూరంలో వారి భూభాగంలోనే కూలిపోయిందని వార్తలు వచ్చాయి.

ఇలా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పాక్ గుట్టుచప్పుడు కాకుండా ఆయుధాలు, సైన్యాన్ని సరిహద్దు వైపునకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తమ యుద్ధ ట్యాంకులను పంజాబ్ లోని సియాల్ కోట్ కు రహస్యంగా తరలిస్తోంది.

కాగా, ఈ విషయమై పాకిస్థాన్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, స్థానికులు యుద్ధ ట్యాంకుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

WAR
India
Pakistan
war tanks
moving
secretly
  • Loading...

More Telugu News