Rajnath Singh: రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం... హాజరైన ఎన్ఎస్ఏ, రా చీఫ్ లు!

  • న్యూఢిల్లీలో ప్రారంభమైన సమావేశం
  • అజిత్ దోవల్ తో రహస్య భేటీ
  • పరిస్థితిని చర్చిస్తున్న అధికారులు

ఈ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. నార్త్ బ్లాక్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఎన్ఎస్ఏ, రా చీఫ్ లతో పాటు హోమ్ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో అంతకుముందు రాజ్ నాథ్ ఆంతరంగిక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. పాక్ యుద్ధ విమానాలు భారత భూభాంగంలోకి రావడం, ఓ పాక్ విమానాన్ని కూల్చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Rajnath Singh
RAW
NSA
Meeting
  • Loading...

More Telugu News