limca book of records: ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో హైదరాబాదీ ప్యారడైజ్ హోటల్ కు చోటు!

  • అత్యధికులకు బిరియాని సర్వ్ చేసినట్లు రికార్డు
  • ముంబైలో గుర్తింపు పత్రం అందుకున్న నిర్వాహకులు
  • నాలుగు ఔట్ లెట్లు నిర్వహిస్తున్న ప్యారడైజ్ బిరియాని

ప్రస్తుతం బిరియాని అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. ఇరాన్ కు చెందిన ఈ వంటకం అంతగా భారతీయ సంస్కృతిలో భాగమయిపోయింది. చికెన్, మటన్ తో పాటు శాకాహార ప్రియుల కోసం వెజ్ బిరియానీలు కూడా ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్యారడైజ్ ఫుడ్ కోర్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఓ ఏడాది కాలంలో అత్యధిక మందికి బిరియానీని సర్వ్ చేసి ప్యారడైజ్ ఫుడ్ కోర్టు రికార్డు సృష్టించింది.

2017 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 70,44,289 బిరియానీలను ప్యారడైజ్ ఫుడ్ కోర్టు సర్వ్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముంబైలో ఇటీవల జరిగిన ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సదస్సులో ఈ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని అందుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంతో తమకు ఔట్ లెట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

limca book of records
Hyderabad
Telangana
paradise biryanai
  • Loading...

More Telugu News