Pakistan: పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన భారత్.. తీవ్ర ఉద్రిక్తత

  • పాకిస్థాన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసిన భారత్
  • ఎల్వోసీకి 3 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలిన విమానం
  • ప్యారాచూట్ ద్వారా కిందకు దిగిన పైలట్

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. భారత గగన తలంలోకి వచ్చిన ఈ విమానంపై భారత బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో, అది వెనుదిరిగి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ లోని నౌషరా సెక్టార్ కు అవతలి వైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న లామ్ వ్యాలీలో 3 కిలోమీటర్ల దూరంలో విమానం కుప్పకూలిపోయింది. విమానం నుంచి పైలట్ ప్యారాచూట్ ద్వారా కిందకు దిగుతుండటం కనిపించింది. పైలట్ ప్రస్తుత పరిస్థితి తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పరిస్థితి యుద్ధం వైపు వెళ్లేలా కనిపిస్తోంది. మరింత సమాచారం అందాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News