Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ ఎయిర్ స్పేస్ మూసివేత... విమానాలన్నీ రద్దు!

  • తిరిగి ప్రకటించేంత వరకూ ఆదేశాల అమలు
  • పలు విమానాల దారి మళ్లింపు
  • వెల్లడించిన రక్షణ శాఖ

జమ్మూ కశ్మీర్ లో జమ్ము, శ్రీనగర్, లేహ్ ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్టు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. తిరిగి ప్రకటించేంత వరకూ ఎయిర్ స్పేస్ తెరచుకోదని స్పష్టం చేశారు. కమర్షియల్ విమానాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ఉదయం పాకిస్థాన్ కు చెందిన యుద్ధ విమానాలు భారత భూభాగంవైపు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నామని, శ్రీనగర్ తదితర విమానాశ్రయాలకు చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించామని పేర్కొన్నారు. రాజౌరీ, పూంఛ్ సెక్టార్ లోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే.

Jammu And Kashmir
Air Space
Flights
Close
  • Loading...

More Telugu News