Vijayawada: వైసీపీ ఓ చెత్త పార్టీ...అందులో ఎవరు చేరుతారు?: ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌

  • పార్టీ మారుతారని వస్తున్న వార్తలపై క్లారిటీ
  • తనకు అంత అవసరం ఏం వచ్చిందని ఎదురు ప్రశ్న
  • ఇది ఎవరో చేస్తున్న పిచ్చి ప్రచారమని ఖండన

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఓ చెత్త పార్టీ అని, అన్నం తినేవాడు ఎవరైనా అటువంటి పార్టీలో చేరుతారా? అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఘాటుగా విమర్శించారు. ఆయన పార్టీ మారుతున్నారని, వైసీపీలో చేరబోతున్నారని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హల్‌ చేస్తుండడంతో వంశీ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నేను పార్టీ మారుతున్నానని మీకు ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు. అయినా తెలుగుదేశం పార్టీని వీడాల్సిన అవసరం ప్రస్తుతం తనకు ఏమొచ్చిందన్నారు. ఎవరో చేస్తున్న పిచ్చి ప్రచారానికి తానెందుకు సమాధానం చెప్పాలన్నారు. అవన్నీ ఒట్టి ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

Vijayawada
gannavaram
Vallabhaneni Vamsi
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News