IAS: ఆదర్శ వివాహం చేసుకున్న ఐఏఎస్ యువజంట... పెళ్లి ఖర్చు రూ. 500 మాత్రమే!

  • హుబ్లీలోని మినీ విధానసౌధలో వివాహం
  • నిరాడంబరంగా వివాహం చేసుకున్న ఐఏఎస్ జంట
  • అభినందనలు తెలిపిన బంధుమిత్రులు, అధికారులు

పెళ్లికి భారీగా ఖర్చుపెట్టి, ఆడంబరాలు చేసుకోవడం కన్నా, ఆ డబ్బును భవిష్యత్తులో వచ్చే ఆర్థిక ఇబ్బందులను తీర్చుకునేందుకు వాడుకోవడం ఉత్తమమని నమ్మిన ఓ యువ ఐఏఎస్ జంట, కేవలం రూ. 500 ఖర్చుతో తమ వివాహాన్ని చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ వివాహానికి కర్ణాటక, హుబ్లీలోని మినీ విధానసౌధ వేదికైంది.

విజయవాడకు చెందిన హెప్సిబారాణి ప్రస్తుతం ఉడుపి జిల్లా అధికారిణిగా పనిచేస్తుండగా, పశ్చిమబెంగాల్‌ కు చెందిన కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ ఉజ్వల్‌ కుమార్‌ ఘోష్‌ తో పరిచయం ఏర్పడింది. బాగల్‌ కోట జిల్లా కృష్ణా ఎగువ ప్రాజెక్టు కమిషనర్‌ గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారగా, పెద్దలను ఒప్పించారు. నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని భావించి, అతి తక్కువ ఖర్చుతో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. నూతన జంటను బంధుమిత్రులు, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.

IAS
Marriage
Hebbapi Rani
Ujwal Kumar
  • Loading...

More Telugu News