Pawan Kalyan: అహోబిలం అద్భుతం... తిరుమలలా మార్చాలి: పవన్ కల్యాణ్

  • అహోబిలం ప్రకృతి అందాలు ఎంతో నచ్చాయి
  • గవర్నర్ తో రాజకీయ అంశాలు మాట్లాడలేదు
  • నేటి ఉదయం మీడియాతో పవన్ కల్యాణ్

అహోబిలం ప్రాంతం అద్భుతంగా ఉందని, ఇక్కడి వాతావరణం, ప్రకృతి అందాలు తనకు ఎంతో నచ్చాయని, ఓ మూలకు విసిరేసినట్టుగా ఉన్న అహోబిలం ప్రాంతాన్ని తిరుమలలా మార్చాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అహోబిలం చేరుకుని, స్వామిని దర్శించుకున్న ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు.

కర్నూలు జిల్లాకు ముఖద్వారంగా ఉండాల్సిన అహోబిలం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, పర్యాటక క్షేత్రంగా, దైవక్షేత్రంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించవచ్చని అన్నారు. మంగళవారం నాడు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో జరిగిన భేటీ గురించి మీడియా ప్రశ్నించగా, తమ మధ్య ఎటువంటి రాజకీయ అంశాలూ చర్చకు రాలేదని, కేవలం యోగక్షేమాల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని పవన్ తెలిపారు.

Pawan Kalyan
Ahobilam
Kurnool District
  • Loading...

More Telugu News