Hyderabad: ఫైటర్ జెట్ పైలట్ గా హైదరాబాదీ... ఎవరో మాత్రం చెప్పేది లేదంటున్న ఉన్నతాధికారులు!

  • ఫైటర్ జెట్ పైలట్లపై ప్రశంసల జల్లు
  • ఓ హైదరాబాద్ యువకుడు ఉన్నాడని వార్తలు
  • అటువంటి విషయాలు వెల్లడించలేమన్న రక్షణశాఖ

మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోకి దూసుకెళ్లి, అక్కడి ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన మిరేజ్ యుద్ధవిమానాలను నడిపించిన పైలట్ల ధైర్యసాహసాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ, ఈ విమానాలు నడిపిన వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారని ప్రచారం జరుగుతోంది.

నిన్న దాడుల వ్యవహారం బయటకు వచ్చిన తరువాత హైదరాబాద్ పైలట్ కూడా ఉన్నారంటూ మీడియాలో వార్తలు, టీవీల్లో స్క్రోలింగ్ వచ్చింది. దీన్ని చూసిన ఎంతో మంది సదరు పైలట్ కుటుంబాన్ని కలిసి ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నారు. అయితే, ఆ పైలట్ ఎవరన్న విషయం మాత్రం నిర్ధారణ కాలేదు.

ఇదే విషయమై రక్షణ శాఖ వర్గాలను మీడియా సంప్రదించగా, హైదరాబాద్ వ్యక్తి విమానాన్ని నడిపినట్టుగా తమకు సమాచారం లేదని, ఒకవేళ సమాచారం తమ వద్ద ఉన్నా, భద్రతా పరమైన అంశాల దృష్ట్యా వెల్లడించే ప్రసక్తే లేదని, ఇటువంటి సమాచారం పూర్తి గోప్యమని స్పష్టం చేశారు.

Hyderabad
Fighter Jets
Pilot
Defence
  • Loading...

More Telugu News