Jayaram: జయరాం హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్

  • వివరాలు వెల్లడించిన వెస్ట్‌జోన్ డీసీపీ
  • ప్రధాన నిందితుడితో కలిసి జయరాం హత్య
  • ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన మరో నిందితుడు

ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్యకేసులో మరో ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి కేఎస్ రావుతో కలిసి వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు.  ఎస్‌ఆర్‌నగర్‌‌లోని బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్‌ నేనావత్‌ నగేష్‌ అలియాస్‌ సింగ్‌ అలియాస్‌ బాబుసింగ్‌(35), ఆయన మేనల్లుడు విస్లావత్‌ విశాల్‌(20), సుభాష్‌చంద్రారెడ్డి(26)లను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వీరు ముగ్గురూ జయరాం హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు డీసీపీ తెలిపారు. వీరందరూ కలిసి ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి ఇంట్లో జయరాంతో బలవంతంగా పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. ఈ ఘటనను నగేశ్ వీడియో తీసినట్టు పోలీసులు తెలిపారు.

Jayaram
NRI
Hyderabad
Rakesh Reddy
shikha choudary
jubilee hills
  • Loading...

More Telugu News