India: సర్జికల్ స్ట్రయిక్స్-2 కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందంటే..!

  • లేజర్ గైడెడ్ బాంబుల ఖరీదు రూ.1.7 కోట్లు
  • మిరేజ్ జెట్ల ఖరీదు రూ.2,568 కోట్లు
  • ఆపరేషన్ బడ్జెట్ మొత్తం రూ.6,300 కోట్లు

సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణత్యాగాలకు భారత వాయుసేన అంతకు అంత బదులు తీర్చుకుంది. జాతి గర్వపడే రీతిలో అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి పాకిస్థాన్ లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన స్థావరాన్ని నేలమట్టం చేసింది. భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్-2000 ఫైటర్ విమానాలు కొన్ని సెకన్లలోనే జైషే ట్రైనింగ్ సెంటర్ ను నామరూపాల్లేకుండా చేశాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాకోట్ వద్దకు వెళ్లిరావడానికే అధిక సమయం పట్టింది తప్ప బాంబులు వేసి ఉగ్రవాదులను హతమార్చడానికి పెద్దగా సమయం పట్టలేదు. మొత్తం 21 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయింది.

అయితే, ఈ మెరుపుదాడి కోసం భారత వాయుసేన రూ.6,300 కోట్ల బడ్జెట్ కేటాయించింది. సర్జికల్ స్ట్రయిక్స్-2లో ప్రధాన పాత్ర పోషించిన మిరేజ్-2000 విమానాల విలువ రూ.2,568 కోట్లు కాగా, అవి జారవిడిచిన బాంబుల ఖరీదు రూ.1.7 కోట్లు. ఇవి 1000 కిలోల బరువైన లేజర్ గైడెడ్ తరహా బాంబులు. ఒక్కోటి రూ.56 లక్షలు ఖరీదు చేస్తుందని రక్షణ వర్గాల అంచనా.

వాస్తవానికి, ఈ దాడి కోసం భారత్ భారీ బడ్జెట్ కేటాయించినా వాయుసేన సమర్థత కారణంగా అందులో సగమే వినియోగించినట్టయింది. ఇంకా రూ.3,686 కోట్ల ప్రాపర్టీని వినియోగించనే లేదు. మిరేజ్ ఫైటర్ జెట్లకు దన్నుగా సుఖోయ్ 30ఎంకేఐ, మిగ్ 29ఎస్ విమానాలను కూడా మోహరించినా వాటి అవసరం రాలేదు. మిరేజ్ లకు మద్దతుగా ఇల్యూషిన్ 78, అవాక్స్ తరహా విమానాలు మాత్రం సరిహద్దు ప్రాంతంలో గగనతల పహారా కాశాయి.

  • Loading...

More Telugu News