Chandrababu: పత్తిపాడు టికెట్ కోసం ఆసక్తికర పోటీ

  • టికెట్ ఆశిస్తున్న తాతా మనవళ్లు
  • చంద్రబాబుతో భేటీ
  • రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానన్న సీఎం

తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు అసెంబ్లీ టికెట్ కోసం తాతా మనవళ్ల మధ్యే పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది. పత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు.. వరుసకు ఆయన మనవడైన వరుపల రాజా ఇద్దరూ సీఎం చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసి.. పత్తిపాడు టికెట్ కేటాయించాలని కోరారు. సర్వే చేసి అది ఎవరికి అనుకూలంగా వస్తే వారికి కేటాయించాలని సీఎంను కోరినట్టు రాజా తెలిపారు. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో టికెట్‌పై స్పష్టత ఇస్తానని చంద్రబాబు ఇరువురికీ తెలిపారు.

Chandrababu
Varupula Subba Rao
Varupula Raja
Pathipadu
  • Loading...

More Telugu News