india: పాక్ తప్పకుండా స్పందిస్తుంది: భారత రక్షణ రంగ నిపుణుడు సిసోడియా

  • ఏం చేస్తుందన్న విషయమై ఆలోచించాలి
  • అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చే యత్నం చేస్తుంది
  • పాక్ రాజకీయాలు, సైన్యం వైఖరిని చూస్తుంటే తెలుస్తోంది

పీఓకే పై భారత వైమానిక దాడుల అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైకి పాకిస్థాన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని రక్షణ రంగ నిపుణుడు గోవింద్ సింగ్ సిసోడియా అభిప్రాయపడ్డారు. పాక్ రాజకీయాలు, అక్కడి సైన్యం వైఖరిని చూస్తుంటే దీనిపై ఆ దేశం ఏదో ఒక రూపంలో స్పందిస్తుందని అనిపిస్తోందని అన్నారు.

మరోవైపు ప్రపంచ దేశాలు కూడా భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖని దాటి శత్రువు శిబిరంపై దాడి జరిగిందని, దీనిపై పాక్ తప్పక స్పందిస్తుందని, అయితే, ఏం చేస్తుందన్న విషయమై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో భారత్ కూడా సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని సిసోడియా అన్నారు.

india
Pakistan
loc
defence
govind singh
  • Loading...

More Telugu News