delhi: భగవంతుడి కృప ఎప్పుడూ మనపైనే ఉంటుంది: ప్రధాని మోదీ

  • ఉగ్రవాదులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు
  • ఉగ్రవాదం ఎప్పటికైనా ఓడిపోతుందని తెలియజేయాలి
  • అతిపెద్ద భగవద్గీతను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను ప్రధాని మోదీ ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలోని కైలాశ్ కాలనీకి సమీపంలో ఉన్న ఇస్కాన్ దేవాలయాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అతిపెద్ద భగవద్గీతను ఆయన విడుదల చేశారు. ఈ అతిపెద్ద భగవద్గీత 670 పేజీలతో 800 కిలోల బరువు ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారని, తీవ్ర వాదుల ఆగడాల నుంచి మనమంతా భూమిని కాపాడాలని కోరారు. భగవంతుడి కృప ఎప్పుడూ మనపైనే ఉంటుందన్న మోదీ, ఉగ్రవాదం ఎప్పటికైనా ఓడిపోతుందని వారికి తెలియజేయాలని అన్నారు.

delhi
iskcon
pm
modi
bhagvad gita
  • Loading...

More Telugu News