shraddha kapoor: 'సాహో' నుంచి సెకండ్ వీడియో వచ్చేస్తోంది

- ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్
- మార్చి 3వ తేదీన శ్రద్ధా పుట్టినరోజు
- ఆగస్టు 15న రిలీజ్ చేసే అవకాశం
ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' సినిమాపైనే వుంది. 'బాహుబలి 2' తరువాత వస్తోన్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. మార్చి 3వ తేదీన శ్రద్ధా కపూర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేయనున్నారు.
