Surgicle Strikes: సర్జికల్ స్ట్రయిక్స్: మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి స్పందన!

  • టాలీవుడ్ ప్రముఖుల అభినందనల వర్షం
  • గర్విస్తున్నామని ట్వీట్లు
  • సర్జికల్ స్ట్రయిక్స్ పై పలువురి స్పందన

భారత సర్జికల్ స్ట్రయిక్స్ పై టాలీవుడ్ ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తదితరులు తమతమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా, పాక్ లోకి దూసుకెళ్లి దాడులు చేసి పెద్దఎత్తున ఉగ్రవాదులను హతమార్చి వచ్చిన వాయుసేన దళాలపై ప్రశంసలు కురిపించారు.

 మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్" అన్నారు. ఇదే దాడులపై స్పందించిన ఎన్టీఆర్ "మన దేశం గట్టి జవాబు ఇచ్చింది. భారత వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నా" అనగా, "సెల్యూట్ టూ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్... జై హింద్" అని రాజమౌళి, "భారత వాయుసేనను చూసి గర్విస్తున్నా... జై హింద్" అని రామ్ చరణ్ ట్వీట్లు పెట్టారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News