pakistan: పాకిస్థాన్ డ్రోన్ ను పేల్చివేసిన భారత సైన్యం

  • గుజరాత్ సరిహద్దుల్లో తిరుగుతున్న పాకిస్థాన్ డ్రోన్
  • అత్యాధునిక సాంకేతికత సాయంతో పేల్చి వేసిన భారత్ సైన్యం
  • సరిహద్దుల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన భారత్

ఈ తెల్లవారుజామున పాకిస్థాన్ పై భారత్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇంకా చెప్పాలంటే సరిహద్దుల్లో సంపూర్ణ యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని ముందే పసిగట్టిన పాకిస్థాన్... డ్రోన్ల ద్వారా మన సరిహద్లులపై నిఘా వేసింది.

ఈ క్రమంలో, ఈ ఉదయం 6.30 గంటల సమయంలో గుజరాత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్ ను భారత సైన్యం కనిపెట్టింది. అత్యాధునిక సాంకేతికత సాయంతో డ్రోన్ ను గాల్లోనే పేల్చివేసింది. పాక్ పై వాయుసేన దాడుల నేపథ్యంలో, సరిహద్దుల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో భారత్ హైఅలర్ట్ ప్రకటించింది.

pakistan
drone
gujarath
boarder
indian army
fire
  • Loading...

More Telugu News