modi: సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయాయి... తర్వాత ఏం చేద్దాం?.. హైలెవెల్ సమావేశాన్ని నిర్వహించిన మోదీ
- మోదీ నివాసంలో హైలెవెల్ మీటింగ్
- హాజరైన నిర్మల, రాజ్ నాథ్, జైట్లీ, ధోవల్, ఇతర అధికారులు
- భవిష్యత్ కార్యాచరణపై చర్చ
నియంత్రణ రేఖకు అవతల పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర తండాలపై భారత వాయుసేన ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో విరుచుకుపడింది. పాక్ సైన్యం, ఉగ్రవాదులు ఏం జరుగుతోందో గుర్తించేలోగానే పని పూర్తిచేసుకు వచ్చింది. 12 మిరేజ్-2000 ఫైటర్ జెట్స్ ద్వారా 1000 కేజీల బాంబులతో ఎల్వోసీకి అవతల విధ్వంసం సృష్టించింది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో హైలెవెల్ సమావేశాన్ని నిర్వహించారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ ను తన సహచరులకు మోదీ వివరించారు. వాయుసేన సాధించిన విజయం, ప్ర్తస్తుత పరిస్థితిపై చర్చించారు. ఇకపై చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లతో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత అధికారులు హాజరయ్యారు.
వైమానిక దళ దాడులు వంద శాతం విజయవంతమైనట్టు తెలుస్తోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం... ఏ మాత్రం తప్పుదొర్లకుండా పని పూర్తి చేశారు. పుల్వామా దాడి తామే చేశామని జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మన వాయుసేన దాడులతో మసూద్ అజార్ కు దిమ్మతిరిగిపోయుంటుంది.