Manohar Parrikar: రక్తంతో కూడిన వాంతులు చేసుకున్న మనోహర్ పారికర్!

  • ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉంది
  • భయపడాల్సిన అవసరం లేదు
  • మీడియా సంయమనం పాటించాలన్న ప్రమోద్ సావంత్

ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాజాగా రక్తంతో కూడిన వాంతులు చేసుకోగా, ఆయన్ను చికిత్స నిమిత్తం గోవా మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పారికర్ కు వైద్య సేవలు అందిస్తున్న ప్రత్యేక డాక్టర్ ప్రమోద్ జార్జ్ వెల్లడించారని, గోవా అధికార ప్రతినిధి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. తాను స్వయంగా ముఖ్యమంత్రిని కలిశానని, ఆయన ఛాతీలో ఇన్‌ ఫెక్షన్ వచ్చినట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. చికిత్స అనంతరం నేడు ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ విషయంలో మీడియా అనవసర రాద్ధాంతం చేయవద్దని కోరారు. 

Manohar Parrikar
Blood
Hospital
Goa
  • Loading...

More Telugu News